భారతదేశం, ఆగస్టు 15 -- Sony Network Announced Sony Vizha TV Channel: భారతీయ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా (SPNI) ఇప్పుడు తమిళ ప్రాంతీయ మార్కెట్‌పై కన్నేసింది. 'సోనీ విళా' (Sony VIZHA) పేరుతో ఒక కొత్త తమిళ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పిల్లలు ఆలపించిన తమిళనాడు రాష్ట్ర గీతం 'తమిళ్ తాయ్ వాళ్తు' వేదికగా ఈ ఛానెల్ పేరు, లోగోను ఆవిష్కరించారు. సౌత్ ఇండియాలో ఇప్పటికే సన్ టీవీ, విజయ్ టీవీ, జీ తమిళ వంటి దిగ్గజ ఛానెల్స్ గట్టి పోటీ ఇస్తున్నాయి.

ఈ పోటీని తట్టుకొని తమిళ ఇంటింటి సంస్కృతి, ఆచారాలు, ప్రాంతీయ భావోద్వేగాలకు అద్దం పట్టే కథలతో ముందుకు రావడం సోనీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబర...