భారతదేశం, మార్చి 29 -- ప్రణవ్ రావ్ రాణి, ప్రజక్త గైక్వాడ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "గూగుల్ మై ఫ్రెండ్". ఈ చిత్రాన్ని డాలర్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బహు భాషల్లో పలు హిట్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోవింద్ వరాహ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

"గూగుల్ మై ఫ్రెండ్" సినిమాకు టి. వెంకటేష్ రెడ్డి, బి.ప్రసన్నాంజనేయులు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, మరాఠీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, సాయి రాజేశ్, వి సముద్ర, శైలేష్ కొలను, కొండా విజయ్ కుమార్ చేతుల మీదుగా గూగుల్ మై ఫ్రెండ్ చిత్ర సాంగ్స్ లాంఛ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. "మా దర్శకుల సంఘం సభ్యులు, మా ఆత్మీ...