భారతదేశం, మే 10 -- Sonam Kapoor Second Son Name Reveal: బాలీవుడ్ వెండితెర 'మసక్కలి' సోనమ్ కపూర్ ఇంట మళ్లీ వేడుక మొదలైంది. హీరోయిన్ సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా దంపతులు మార్చి 29, 2026న రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా తమ రెండో కుమారుడికి 'రుద్రలోక్ కపూర్ అహుజా' అని నామకరణం చేసినట్లు ఈ జంట అధికారికంగా వెల్లడించింది.

కేవలం పేరు ప్రకటించడమే కాకుండా, ఆ పేరు వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని, పురాణ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ సోనమ్ కపూర్ షేర్ చేసిన సందేశం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

తమ రెండో కుమారుడు ఏకాదశి వంటి అత్యంత పవిత్రమైన రోజున జన్మించాడని, ఇది విష్ణుమూర్తి కృప వల్ల జరిగిన అద్భుతమని సోనమ్ కపూర్ పేర్కొన్నారు.

"మా జీవితాలను మరోసారి దైవిక శక్తి మార్చేసింది. రుద్రలోక్ రాక ఒక దైవిక సంకేతంలా, తన అన్నయ్య వాయుతో ఉన్న ఒక...