భారతదేశం, మే 11 -- Soha Ali Khan Relationship With Saif Ali Khan Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ పటౌడీ కుటుంబం అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఈ ఫ్యామిలీకి చెందిన హీరోయిన్ సోహా అలీ ఖాన్ తాజాగా తన కుటుంబ సభ్యుల మధ్య ఉండే బాండింగ్ గురించి మనసు విప్పి మాట్లాడారు. ఈ క్రమంలో తన పటౌడీ ఫ్యామిలీ సీక్రెట్స్‌ను లీక్ చేశారు సోహా అలీ ఖాన్.

జీవితంలోని విభిన్న సందర్భాల్లో తాను ఎవరి వైపు మొగ్గు చూపుతారో, ఎవరి సలహాల కోసం ఎదురుచూస్తారో వివరిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు సోహా అలీ ఖాన్. ఫ్యాషన్ నుంచి రిలేషన్షిప్స్ వరకు, గాసిప్స్ నుంచి కెరీర్ వరకు ప్రతి విషయంలోనూ తనకంటూ ఒక 'గో-టు పర్సన్' ఉన్నారని సోహా అలీ ఖాన్ తెలిపారు.

ముఖ్యంగా రిలేషన్షిప్ (బంధాల) విషయంలో తలెత్తే ఇబ్బందుల గురించి చర్చించాల్సి వస్తే, తాను అన్నయ్య సైఫ్ అలీ ఖాన్ దగ్గరికే వెళ్తాన...