భారతదేశం, జూలై 25 -- Naga Chaitanya Post On Sobhita Dhulipala Cooking Dinner: అక్కినేని ఇంట సరదా ముచ్చట్లు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను విశేషంగా అలరిస్తున్నాయి. యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ వివాహబంధంలోకి అడుగుపెట్టి దాదాపు రెండేళ్లు కాబోతోంది. ఈ నేపథ్యంలో శోభిత తన భర్త కోసం తొలిసారి స్వయంగా వంట చేసి డిన్నర్ సిద్ధం చేసింది.

ఈ ముచ్చటైన క్షణాన్ని నాగ చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోవడంతో అక్కినేని అభిమానులు నెట్టింట తెగ సంబరపడిపోతున్నారు. ఈ పోస్ట్‌లో శోభిత రెండు గిన్నెలతో రాత్రి భోజనం పట్టుకుని ఎంతో సంతోషంగా చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. క్యాజువల్ దుస్తుల్లో సాధారణంగా కనిపించిన ఆమె రూపాన్ని చూసి చైతూ పెట్టిన క్యాప్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

"పెళ్లయిన దాదాపు రెండేళ్లకు నా భార్య నా కోసం రాత్రి భోజనం త...