భారతదేశం, జూలై 21 -- Special Intensive Revision Voter Status : రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ఎంతో శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) ద్వారా తమ ఓటరు వివరాలు విజయవంతంగా నమోదు అయ్యాయా లేదా అనే సందేహం చాలా మంది పౌరుల్లో వ్యక్తమవుతోంది.

ఓటు హక్కు ఉందో లేదో తెలియక, ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ పేరు నమోదుపై ఆందోళన చెందుతున్న వారికి భారత ఎన్నికల సంఘం ఒక సులభమైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా. స్మార్ట్‌ఫోన్ వాడకపోయినా సరే.. మీ చేతిలో ఉన్న సాధారణ కీప్యాడ్ మొబైల్ ఫోన్ ద్వారా ఒక్క SMS పంపి మీ SIR నమోదు స్థితిని నిమిషాల్లో ధృవీకరించుకోవచ్చు.

మీ వద్ద ఉన్న మొబైల్ ఫోన్ మెసేజ్ యాప్‌ను ఓపెన్ చేసి, చాలా సులభమైన పద్ధతిలో ఎన్నికల సంఘం సూచించి...