భారతదేశం, జూలై 8 -- SIR Telangana : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రతి ఓటరు తమ వివరాలను పాత రికార్డులతో సరిచూసుకోవడం ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా 2002 నాటి ఓటర్ల జాబితాలో (SIR-2002) మీ తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్యల వివరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రజల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) కార్యాలయం ఒక సులభమైన ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేసే తెలంగాణ సీఈఓ కార్యాలయం, పాత రికార్డులను శోధించే ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. దీంతో ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా ఇంట్లోనే కూర్చొని కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల్లో వివరా...