భారతదేశం, జూన్ 30 -- తెలంగాణలోని ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనది. ఓటర్ల జాబితాలో మీ పేరు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. అయితే.. ఓటర్ల వివరాల నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించిన 'ఎన్యూమరేషన్ ఫామ్' (Enumeration Form) ఇంకా మీకు అందకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటర్లు తమ ఫామ్‌ను సులభంగా పొందేందుకు ఎన్నికల సంఘం మూడు ముఖ్యమైన మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.

ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో మీ పేరు ఎలాంటి తప్పులు లేకుండా భద్రంగా ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, ప్రతి ఓటరుకు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్త...