భారతదేశం, జూన్ 21 -- SIR in Telangana : రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ ప్రత్యేక సవరణ (SIR) ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయడమేనని సీఈఓ స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం.. ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన వివరించారు.

ఈ ప్రక్రియ కోసం బూత్ స్థాయి అధికారులు (BLOs) ప్రతి ఇంటిని సందర్శిస్తారన...