భారతదేశం, జూన్ 15 -- Special Intensive Revision in Andhrapradesh : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రంలోని నాలుగు కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయడానికి, సరికొత్తగా అప్‌డేట్ చేయడానికి 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026' (Special Intensive Revision - SIR) ప్రక్రియను చేపట్టనున్నారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం(జూన్ 15) నుంచి నెల రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. జులై 14 వరకూ బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ప్రతి ఇంటికీ నేరుగా వెళ్లి వి...