భారతదేశం, జూన్ 13 -- Singer Shaan Recalls School Girls Incident: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్లేబ్యాక్ సింగర్ షాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తన అద్భుతమైన గాత్రంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారాయన.

హిందీతో పాటు తెలుగు, బెంగాలీ వంటి పలు ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి సంగీత ప్రియులను అలరించారు సింగర్ షాన్. సాధారణంగా వెండితెరపై కనిపించే హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ సింగర్లకు కాస్త అరుదుగానే కనిపిస్తుంది.

ముంబై లాంటి నగరాల్లో సింగర్ సెలబ్రిటీలు తిరుగుతున్నా జనం పెద్దగా పట్టించుకోరు. అయితే తన జీవితంలో ఎదురైన ఒక విచిత్రమైన, సరదా సంఘటనను షాన్ ఇటీవల గుర్తుచేసుకున్నారు. ఒకసారి అభిమానులు తనను చుట్టుముట్టారని, కానీ వారు తన కోసం కాకుండా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అనుకు...