భారతదేశం, మార్చి 9 -- గతేడాది డిసెంబర్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాల్లో 'ధురంధర్' (Dhurandhar) ఒకటి. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ చేసిన 'హెయిర్-ఫ్లిప్' సీన్ యూత్‌ను పిచ్చెక్కించింది.

ఒక పెళ్లి రిసెప్షన్ జరుగుతుండగా, మధ్యలో రణ్‌వీర్ సింగ్ (హంజా) తుపాకీ పట్టుకుని శత్రువులతో పోరాడే ఈ యాక్షన్ సీన్ హైలైట్‌గా నిలిచింది. సరిగ్గా ఈ గన్ ఫైట్ జరుగుతున్నప్పుడే బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే 'రంబా హో' (Ramba Ho) సాంగ్ థియేటర్లను దద్దరిల్లేలా చేసింది.

లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్ పాడిన ఈ ఐకానిక్ సాంగ్‌ను కొత్తగా రీమిక్స్ చేసి పాడారు సింగర్ మధుబంతి బాగ్చీ. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో రంబా హో రీమిక్స్ సాంగ్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను మధుబంతి బాగ్చీ పంచుకున్నారు.

సంగీత దర్శకుడు శాశ్వత్ ఈ పాట గురించి తనతో చెప్పినప్పుడు మొదట ఆశ్చర్యపోయానని మధుబంతి తెలిపారు...