భారతదేశం, ఆగస్టు 10 -- Adnan Sami 120 KG Weight Loss Journey: భారతీయ సంగీత ప్రపంచంలో తన విలక్షణమైన గొంతుతో, పియానో మీటలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ. 'లిఫ్ట్ కరాడే', 'తేరా చెహ్రా', 'భర్ దో ఝోలీ మేరీ' వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలతో అలరించిన ఈ పద్మశ్రీ గ్రహీత జీవితంలో ఒక దారుణమైన ఘట్టం ఉంది.

ఒకానొక సమయంలో అద్నాన్ సమీ బరువు ఏకంగా 230 కేజీలకు చేరుకుంది. నిలబడటం కాదు కదా, కనీసం పడుకుని నిద్రపోవడం కూడా ఆయనకు నరకంగా మారిన రోజులు అవి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అద్నాన్ సమీ తాను చావు అంచుల వరకు వెళ్లి ఎలా తిరిగి వచ్చారో వివరిస్తూ అత్యంత భావోద్వేగానికి గురయ్యారు.

బాగా బరువు పెరిగిపోయి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అద్నాన్ సమీ వైద్యులను సంప్రదించారు. ఆ సమయంలో అద్నాన్ సమీ పక్కనే ఆయన తండ్రి కూడా ఉన్నారు. పరీ...