Singareni Free Education : సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు శుభవార్త - పిల్లలకు ఉచిత విద్య..!
భారతదేశం, నవంబర్ 24 -- Singareni Free Education : తెలంగాణ బొగ్గు గని కార్మిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తీపి కబురు అందించాయి. సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సంక్షేమం దిశగా సింగరేణి యాజమాన్యం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు సింగరేణి విద్యాసంస్థల్లో పూర్తిగా ఉచిత విద్యను అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సంస్థ పరిధిలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు భారీ ఆర్థిక ఊరట లభించనుంది.
ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కోల్ బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి కోసం పలు కీలక నిర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.