భారతదేశం, జూన్ 30 -- Singareni Cath Lab Godavarikhani : దేశ ఇంధన అవసరాలను తీరుస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న బొగ్గు గని కార్మికుల ఆరోగ్య రక్షణే పరమావధిగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మరో బృహత్తర అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. కేవలం ఏడాది కాలంలోనే రామగుండం-1 ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాధునిక గుండె వైద్య విభాగాన్ని (కార్డియాక్ క్యాథెటరైజేషన్ ల్యాబొరేటరీ - క్యాథ్ ల్యాబ్) ఏర్పాటు చేసింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఈ అత్యాధునిక ల్యాబ్, సింగరేణి చరిత్రలోనే తొలి కావడం విశేషం. ఏటా సుమారు రూ.6 కోట్ల నిర్వహణ వ్యయంతో నడవనున్న ఈ ల్యాబ్ ద్వారా బొగ్గు బెల్ట్ పరిధిలోని వేలాది మంది ప్రాణాలు నిలవనున్నాయి.

ఈ ల్యాబ్‌ను కార్మికులు అత్యధికంగా నివసించే గోదావరిఖని (సుమారు 33 వేల మంది కార్మికులు) కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీని వ...