భారతదేశం, నవంబర్ 2 -- ఉత్తమ మైనింగ్ పద్ధతుల అమలు, పర్యావరణహిత చర్యలు, కార్మికుల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో సింగరేణి సంస్థ ఉత్తమ కంపెనీగా ఉంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో 5 బొగ్గు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే చేతుల మీదుగా.. సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఈ అవార్డులను అందుకున్నారు.

ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను అందుకున్న గనులలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కేఎన్‌టీ, ఆర్‌కే-6 ఇంక్లైన్, సత్తుపల్లి ఏరియాకు చెందిన జేవీఆర్ ఓసీ-2, బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఖైరీగూఢ ఓసీ, రామగుండం-3కి చెందిన ఆర్‌జీఓసీ-1 గనులు ఉన్నాయి. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతీ ఏడాది...