భారతదేశం, ఏప్రిల్ 16 -- Sidharth Malhotra Pookie: వెండితెరపై యాక్షన్ హీరోగా మెప్పించే సిద్దార్థ్ మల్హోత్రా, నిజ జీవితంలో మాత్రం తన ముద్దుల కూతురి దగ్గర సాఫ్ట్ డాడ్‌గా మారిపోయారు. గతేడాది భార్య కియారా అద్వానీతో కలిసి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా సిద్దార్థ్ 'గర్ల్ డాడ్' ఎరాకు సంబంధించిన ఒక క్యూట్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

బుధవారం (ఏప్రిల్ 15) ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఒక ఫోటో షేర్ చేశారు. అందులో సిద్ధార్థ్ తెల్లటి టీషర్ట్ ధరించి కెమెరా వైపు చూస్తూ చిరునవ్వు చిందిస్తున్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆయన తలకి పెట్టుకున్న చిన్న తెల్లటి 'బౌ' (Bow) క్లిప్పు.

"నేను ఒక గర్ల్ డాడ్ అని చెప్పకుండానే.. నేను ఒక గర్ల్ డాడ్ అని చెప్పండ...