భారతదేశం, ఆగస్టు 20 -- Siddipet Car Accident : సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పసిపిల్లలు కూడా ఉండటంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

దుబ్బాక మండలం బల్వంతాపూర్‌కు చెందిన దండుగుల రాజు (30) ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఆయన తన భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్ష్‌ (4), కుమార్తె శాన్విక (2)తో కలసి సిద్దిపేటలో జరిగిన ఒక బంధువు దశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అర్థరాత్రి వేళ స్వగ్రామానికి కారులో బయలుదేరారు.

వాహనం దుబ్బాక మండలం అప్పన్నపల్లి శివారుకు చేరుకోగానే ఊహించని ప్రమాదం జరిగింది. రాజు తోలుతున్న కారు ఒక్కసారి...