భారతదేశం, జూలై 14 -- Shruti Haasan Grihapravesh In New Home: వైవిధ్యమైన నటనతోనే కాకుండా సింగర్‌గా, మ్యుజీషియన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్. లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ, తన స్వయంకృషితోనే స్టార్ హోదాను దక్కించుకున్నారు.

కెరీర్ పరంగా ఎప్పుడూ బిజీగా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా చెన్నై నగరంలో సరికొత్త సొంతింటి కలని నిజం చేసుకున్నారు. తన సొంత ఊరు, కుటుంబానికి మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే శ్రుతి హాసన్ సరికొత్తగా ఇల్లు కొన్నట్లు తెలుస్తోంది. సోమవారం (జూలై 13) జరిగిన శ్రుతి హాసన్ నూతన గృహప్రవేశ వేడుకకు సంబంధించిన కొన్ని ప్రత్యేక క్షణాల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి.

కొత్త ఇంట్లో శ్రుతి హాసన్ నేలపై కూర్చుని ఎంతో భక్తి...