భారతదేశం, ఫిబ్రవరి 27 -- ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తన మధురమైన గొంతుతో దశాబ్దాలుగా కోట్లాది మంది సంగీత ప్రియులను అలరిస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో ఒక పాట హిట్టా కాదా అనేది యూట్యూబ్ వ్యూస్, ఇన్‌స్టాగ్రామ్ లైకులను బట్టి లెక్కేస్తున్నారు.

అయితే, శ్రేయా ఘోషల్ మాత్రం దీనితో ఏకీభవించడం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రేయా ఘోషల్ పాట అసలైన విజయం ఎక్కడ ఉంటుందో తనదైన శైలిలో వివరించారు.

"ఈ రోజుల్లో లైకులు, వ్యూస్ అనేవి చాలా మోసపూరితమైనవి. ఎందుకంటే డబ్బు ఉంటే దేన్నైనా కొనేయొచ్చు (హర్ చీజ్ ఖరీదీ జా సక్తీ హై). కానీ, నేను ఒక కచేరీలో (కాన్సర్ట్) పాడుతున్నప్పుడు.. అక్కడి ప్రేక్షకులు నాతో కలిసి ఆ పాటను పాడుతుంటే, ఆ పాటను మనస్ఫూర్తిగా ఓన్ చేసుకుంటే.. అదే ఆ పాట సాధించిన అసలైన విజయం" అని శ్రేయా ఘోషల్ పేర్కొన్నారు.

మొదటిసారి పాడిన పాటను కూడా ప్రేక్...