భారతదేశం, మే 31 -- Shiva Rajkumar Almost Quit Ram Charan Peddi For Cancer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా 'పెద్ది'. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఈ నేపథ్యంలో చెన్నైలో నిర్వహించిన పెద్ది ప్రమోషన్స్ వేదికగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ (Shivanna) ఒక ఊహించని నిజాన్ని బయటపెట్టారు. తనకు క్యాన్సర్ మహమ్మారి సోకిన సమయంలో ఈ సినిమా నుంచి దాదాపు తప్పుకోవాలని అనుకున్నట్లు ఆయన ఎమోషనల్ అయ్యారు.

చెన్నై ఈవెంట్‌లో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ .. 'పెద్ది' చిత్ర బృందం చూపించిన ఓపికకు, ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. 2024లో తనకు క్యాన్సర్ అ...