భారతదేశం, మార్చి 22 -- బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఏదైనా పండగ వచ్చిందంటే చాలు.. తనదైన శైలిలో అభిమానులను పలకరిస్తూ సందడి చేస్తారు. అలాగే, శుభాకాంక్షలు తెలియజేస్తారు. అయితే, శనివారం (మార్చి 21) అర్ధరాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు ఈద్ ముబారక్ చెబుతూ ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను పంచుకున్నారు షారుఖ్ ఖాన్.

పచ్చని షేర్వానీ, బ్లాక్ సల్వార్ ధరించి ఎంతో హుందాగా సలామ్ చేస్తున్న తన ఫోటోను షేర్ చేస్తూ అందరికీ ప్రేమను, వెలుగులను పంచారు షారుఖ్ ఖాన్. ఈ సందర్భంగా షారుఖ్ తన పోస్ట్‌లో.. "మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందకరమైన, ప్రశాంతమైన ఈద్ శుభాకాంక్షలు. అందరి జీవితాల్లో ప్రేమ, వెలుగులు నిండాలి. మనం కోరుకున్నవన్నీ, అంతకంటే ఎక్కువే ఆ అల్లా మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.. ఈద్ ముబారక్!" అని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

ఈ పోస్ట్ వెంటనే సోషల్ ...