భారతదేశం, ఆగస్టు 6 -- Serial Actress Jiya Shankar Engagement Photos: రియాలిటీ షో బిగ్ బాస్ ఓటీటీ 2 ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్ హీరోయిన్ జియా శంకర్ తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. గత కొంతకాలంగా సీక్రెట్‌గా ఉంచిన తన ప్రేమకథను అధికారికంగా బయటపెట్టడమే కాకుండా, తనకు నిశ్చితార్థం కూడా పూర్తయిందని ప్రకటించారు.

తన కాబోయే భర్త కరణ్‌తో సూర్యాస్తమయం వేళ తీయించుకున్న రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక భావోద్వేగ నోట్ రాసుకొచ్చారు. కరణ్‌ను పరిచయం చేస్తూ జియా శంకర్ రాసిన క్యాప్షన్ ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

"మనం అస్సలు ఊహించని సమయంలోనే నిజమైన ప్రేమ దొరుకుతుందనేది నిజమే కావచ్చు. దేవుడు నా ఓపికను చాలా రకాలుగా పరీక్షించాడు. ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. కానీ, నా నుంచి వేల మైళ్ల దూరంలో ...