Secunderabad Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లుక్ మారుతోంది! ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు - వేగంగా పనులు
భారతదేశం, ఆగస్టు 5 -- Secunderabad Railway Station Redevelopment : హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన, దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ త్వరలోనే సరికొత్త రూపంలో ప్రయాణికులకు దర్శనమివ్వనుంది. ప్రయాణికులకు విమానాశ్రయ స్థాయి సౌకర్యాలను అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రపంచ స్థాయి అత్యాధునిక పునరాభివృద్ధి (రిడెవలప్మెంట్) పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే 65 శాతం పూర్తి కావొచ్చాయి.
ప్రతిరోజూ ఈ స్టేషన్ నుంచి సుమారు 180 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సగటున 1.5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ స్టేషన్‌పైనే ఆధారపడతారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, రాబోయే ఐదు దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమగ్ర పునర్నిర్మాణాన్ని ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.