భారతదేశం, ఏప్రిల్ 3 -- వేసవి కాలంలో పశువులను చూసుకోవాల్సిన విధానంపై పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు మార్గదర్శకాలు జారీ చేశారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఉత్పాదకతను మెరుగుపరచడానికి రైతులు కాలానుగుణ మార్గదర్శకాలను పాటించాలని కోరారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలులు, వేడి గాలులు పశువులపై ప్రభావం చూపుతాయని నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే సలహాలను జాగ్రత్తగా పాటించడం వల్ల పశువులు బాగుంటాయని, రైతుల ఆదాయాలు పెరుగుతాయని అన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....