భారతదేశం, మే 22 -- SCR Charlapalli Bhubaneswar New Express : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో తీపి కబురు అందించింది. గతంలో నడిచిన చర్లపల్లి - భువనేశ్వర్ న్యూ వీక్లీ స్పెషల్ రైళ్లను (Train No. 07165/07166) క్రమబద్ధీకరించింది. వాటి స్థానంలో సరికొత్తగా రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రైలు నంబరు 17067/17068 తో నడిచే ఈ సరికొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు మే 25, 2026 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

చర్లపల్లిలో సోమవారం సాయంత్రం 18:10 గంటలకు బయలుదేరి.. నల్గొండ (19:18), మిర్యాలగూడ (19:58), గుంటూరు (23:05), విజయవాడ (మంగళవారం తెల్లవారుజామున 00:3...