భారతదేశం, జూలై 10 -- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. ముంబై డివిజన్ పరిధిలోని కర్జాత్ - లోనావాలా సెక్షన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, దానికి తోడు కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రైల్వే శాఖ పూర్తిగా రద్దు చేసింది.

జూలై 10వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ రైళ్ల రద్దు నిర్ణయం అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, చెన్నై నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులపై ఈ ప్రభావం పడనుంది.

ప్రమాదకరంగా మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మార్గాల్లో ప్రయాణించేందుకు ముందే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని సూచించారు.

ప్ర...