భారతదేశం, జూలై 2 -- SCR Train Cancellations : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. నిర్వహణాపరమైన లోపాల (ఆపరేషనల్ కన్స్ట్రైంట్స్) కారణంగా హైదరాబాద్ - మంగళూరు, సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య నడిచే పలు వారంతపు ప్రత్యేక రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో పొడిగించిన ఈ సర్వీసులను ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

రైల్వే శాఖ ప్రకటనలోని వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్లే ప్రత్యేక రైలు (నంబర్ 07097) జూలై నెలలో ప్రతి బుధవారం రద్దయింది. అంటే జూలై 8, 15, 22, 29 తేదీల్లో ఈ రైలు నడవదు. దీనివల్ల మొత్తం 4 ట్రిప్పులు రద్దయ్యాయి. ఇక తిరుగు ప్రయాణంలో మంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే రైలు (నంబర్ 07098) జూలై 9, 16, 23, 30 తేదీల్లో (ప్రతి గురువారం) ప్ర...