భారతదేశం, జూన్ 4 -- SCR Summer Special Trains 2026 : వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుండి బెంగళూరు సమీపంలోని యెలహంక మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్ మీదుగా ప్రయాణిస్తాయి. జూలై 2వ తేదీ వరకు మొత్తం 10 సర్వీసులను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ రైళ్లలో థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణిస్తూ ప్రయాణికులకు అనుకూలంగా అనేక కీలక స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో భాతాపరా, రాయ్‌పూర్, దుర్గ్, రాజ్‌నంద్‌గావ్, డోంగర్‌గఢ్, గోందియా, వాడ్సా, చందా ఫోర్ట్, బల్లార...