భారతదేశం, మార్చి 29 -- వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

ఏప్రిల్ నుంచి జూన్ 28వ తేదీ వరకు ఈ వేసవి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఏపీ, తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్స్ ఆగుతాయి. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్లే రైలు ( ట్రైన్ నెంబర్ 07425) ఏప్రిల్ 5వ తేదీ నుండి ప్రతి ఆదివారం రాత్రి 11:15 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు సాయంత్రం 5:30 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. ఏప్రిల్ 5,12,18,26, మే 3,10, 17,24,31, ...