భారతదేశం, ఏప్రిల్ 20 -- వేసవి సెలవుల దృష్ట్యా రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని చర్లపల్లి (Charlapalli) రైల్వే స్టేషన్ నుంచి జసిదిహ్, ముజఫర్పూర్, బరౌనీ వంటి ప్రధాన నగరాలకు సమ్మర్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రత్యేక సర్వీసులు ఏప్రిల్ 23 నుంచి మే 3, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో రైలు కేవలం ఒక సర్వీసును మాత్రమే అందిస్తుంది.
ఈ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ ఏప్రిల్ 20, 2026 ఉదయం 08:00 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రయాణికులు ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.