భారతదేశం, ఏప్రిల్ 20 -- వేసవి సెలవుల దృష్ట్యా రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి (Charlapalli) రైల్వే స్టేషన్ నుంచి జసిదిహ్, ముజఫర్‌పూర్, బరౌనీ వంటి ప్రధాన నగరాలకు సమ్మర్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రత్యేక సర్వీసులు ఏప్రిల్ 23 నుంచి మే 3, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో రైలు కేవలం ఒక సర్వీసును మాత్రమే అందిస్తుంది.

ఈ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ ఏప్రిల్ 20, 2026 ఉదయం 08:00 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ ద్వారా లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....