భారతదేశం, జూన్ 27 -- Hyderabad Gorakhpur Special Trains : దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు మరో తీపి కబురు అందించింది. హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ మధ్య ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో, ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్ డెక్కన్ - గోరఖ్‌పూర్ - హైదరాబాద్ డెక్కన్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం. రెండు దిశలలోనూ చెరో 5 ట్రిప్పుల చొప్పున మొత్తం 10 అదనపు సర్వీసులను నడపనున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగుతాయి.

హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే ఈ ప్రత్యేక రైలు ప్రతి వారం శుక్రవారం అందుబాటులో ఉంటుంది. జూలై నెలలో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ఈ సర్వీసును పొడిగించారు. ఈ రైలు జూలై 3, జూలై 10, జూలై 17, జూలై 2...