SCR Special Trains : రైలు ప్రయాణికులకు శుభవార్త... సికింద్రాబాద్ - కాగజ్‌నగర్ మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు
భారతదేశం, సెప్టెంబర్ 4 -- సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో ప్రయాణించే రైలు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రెండు జనసాధారణ్ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు 2026 సెప్టెంబర్ 4న అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ రెండు జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఈ రైళ్లలోని అన్ని భోగీలు అన్‌రిజర్వ్‌డ్ (సాధారణ) కోచ్‌లేనని, ప్రయాణికులు జనరల్ టికెట్లతో నేరుగా ప్రయాణించవచ్చని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ తెలిపారు.
Published ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.