SCR Special Trains : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్... హైదరాబాద్-మంగళూరు స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు
భారతదేశం, జూలై 26 -- SCR Special Trains Extension : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి దక్షిణ భారతంలో ఉన్న ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో పలు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా. హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
వేసవి ప్రయాణాలు, పండుగల సీజన్ దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. సీట్లు త్వరితగతిన నిండిపోతుండటం, వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుండటంతో ఈ సేవా కాలాన్ని మరికొన్ని వారాల పాటు పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గుండా సాగే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.