భారతదేశం, జూలై 19 -- Cherlapally - Kollam Special Trains : పండుగలు, సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి కేరళలోని కొల్లం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 14వ తేదీ నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు మొత్తం ఎనిమిది సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగనున్నాయి.

రద్దీ ఎక్కువగా ఉండే ఈ సీజన్‌లో ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....