భారతదేశం, మార్చి 26 -- వేసవి వేళ ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రద్దీని క్లియర్ చేసేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద - గోరఖ్ పూర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం. హైదరాబాద్ - గోరఖ్‌పూర్(ట్రైన్ నెంబర్ 07075) ను ప్రత్యేక రైలు సేవలను పొడిగించారు. ఏప్రిల్ 3, 10, 17, 24 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ రాత్రి 9 గంటలకు బయల్దేరుతుంది.

ఈ ట్రైన్. సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్ మీదుగా గోరఖ్‌పూర్ కు చేరుకుంటుంది.

ఇక గోరఖ్‌పూర్ - హైదరాబాద్(ట్రైన్ నెంబర్ 07076) మధ్య నడిచే ప...