భారతదేశం, ఏప్రిల్ 30 -- SCR Summer Special Trains : వేసవి సెలవుల్లో విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక క్షేత్రాలైన తిరుచానూరు, తిరుపతికి వెళ్లే భక్తుల కోసం, అలాగే హైదరాబాద్, బెళగావి, నాందేడ్ వంటి ప్రముఖ నగరాల మధ్య ప్రయాణించే వారి కోసం ఈ అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. మే మొదటి, రెండో వారాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది.

తిరుచానూరు - నాందేడ్ - జాల్నా రూట్: మహారాష్ట్ర నుంచి తిరుచానూరు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. రైలు సంఖ్య 07015 (హెచ్.ఎస్. నాం...