భారతదేశం, ఏప్రిల్ 2 -- ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. వేసవి వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి - షాలిమార్ మధ్య వారపు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఈ వివరాలను ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

మొత్తం కలిపి ఈ రూట్లలో 26 ప్రత్యేక రైళ్లుంటాయి. ఈ ప్రత్యేక రైళ్లకు రెండు వైపులా తెలుగు రాష్ట్రాల్లో కాజీపేట, వరంగల్, మహబాబూబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ స్టేషన్లలో ఆగుతాయి.

అంతేకాకుండా బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కియోంజర్ రోడ్, భద్రక్, బాలసోర్, ఖరగ్‌పూర్, సంత్రాగచ్చి స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, క్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్...