భారతదేశం, ఏప్రిల్ 30 -- వేసవిలో రద్దీని దృష్టిలో పెట్టుకుని.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించేవారికి ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి. కాకినాడ-లింగంపల్లి మద్య ఈ సర్వీసులు నడుస్తాయి. ఏ తేదీల్లో ఈ సర్వీసులు నడుస్తాయో చూద్దాం..

07703 కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య ట్రైన్ శుక్ర, శని, ఆదివారాల్లో నడవనుంది. సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు కాకినాడ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది. మే 01, 02, 03వ తేదీల్లో ఈ ట్రైన్ ఉంది.

07704 లింగంపల్లి-కాకినాడ టౌన్ మధ్య రైలు శని, ఆది, సోమవారాల్లో నడుస్తాయి. రాత్రి 8 గంటలకు లింగపల్లిలో బయల్దేరి.. ఉదయం 7.45 నిమిషాలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.

6 ట్రిప్పులు నడిచే ఈ ట్రైన్.. సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మి...