భారతదేశం, మే 22 -- Save The Tigers: సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ తెలుసు కదా. ముగ్గురు భార్యా బాధితుల చుట్టూ తిరిగే ఫన్నీ స్టోరీతో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో జియోహాట్‌స్టార్ ఓటీటీ మూడో సీజన్ ను కూడా తీసుకొస్తోంది. గతేడాది చివర్లోనే టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా ఓ ఫన్నీ ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కు సంబంధించి రేపు అంటే శనివారం (మే 23) సాయంత్రం 4 గంటలకు ఓ అనౌన్స్‌మెంట్ ఉండనున్నట్లు చెబుతూ జియోహాట్‌స్టార్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో యాంకర్ సుమ కనకాల సీరియస్ గా వార్తలు చదువుతూ.. పట్టపగలు ఓ పార్కులోకి మూడు పులులు వచ్చాయంటూ చెప్పడం నవ్వు తెప్పించింది.

వాటిని పట్టుకోవడం కోసం పోలీసులు రంగంలోకి దిగడం, మరోవైపు టీవీ ...