భారతదేశం, మే 31 -- Satyadev: ఏదైనా మూవీ ఓటీటీలోకి వస్తుందంటే, ఆ హీరో దాని డిజిటల్ రిలీజ్ ను ప్రమోట్ చేస్తాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. కానీ ఇక్కడ మాత్రం కనీసం హీరోకు కూడా తెలియకుండా ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన తర్వాత కేవలం ఆరు రోజులకే డిజిట్ డెబ్యూ చేసింది. ఆ మూవీ పేరు 'కృష్ణ‌మ్మ‌'. దాని హీరో సత్యదేవ్. తాజాగా ఈ విషయంపై సత్యదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో హీరో సత్యదేవ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కృష్ణ‌మ్మ‌ ఓటీటీ రిలీజ్ పై అతను సెన్సేషనల్ కామెంట్లు చేశాడు. తన సినిమా విడుదలైన ఆరు రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన విషయం స్వయంగా ఆ హీరోకే తెలియకపోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' సినిమా కేవలం ఆరు రోజుల్లోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేయడం, ...