భారతదేశం, మార్చి 31 -- బాలీవుడ్ తారలు కేవలం వెండితెరపైనే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ముంబైలోని తన ఖరీదైన ఆస్తిని లీజుకు ఇచ్చి భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంధేరీ వెస్ట్‌లోని తన బంగ్లాను ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు అద్దెకు సారా ఇచ్చినట్లు ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా వెల్లడైంది.

ప్రాపర్టీ డేటా సంస్థ 'సీఆర్ఈ మాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన వివరాల ప్రకారం.. అంధేరీ వెస్ట్‌లోని ఓల్డ్ లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్న 'బెల్‌స్కాట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ'లో సారాకు ఒక బంగ్లా ఉంది. సుమారు 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీని 'ప్రాడిజీ మాంటిస్సోరి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థ లీజుకు తీసుకుంది. ఈ ప్రాంగణాన్ని వారు కేవలం పా...