భారతదేశం, ఏప్రిల్ 8 -- టాలీవుడ్‌లో యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే మంచి సక్సెస్ అందుకుంటున్నాడు సంగీత్ శోభన్. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో అలరించిన సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ రాకాస. హారర్ ఫాంటసీ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించారు.

నిహారిక కొణిదెల నిర్మించిన రాకాసలో హీరోయిన్‌గా నయన్ సారిక అలరించింది. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన రాకాస సినిమా మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాకాస సమ్మర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మానస శర్మ, హీరో సంగీత్ శోభన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మానస శర్మ మాట్లాడుతూ .. "'రాకాస' నాకు మొదటి ఫీచర్ ఫిల్మ్. థియేటర్‌లో ఆడియెన్స్‌తో కలిసి ఈ మూవీని చూశాను. నేను ఏదైతే రాసుకున్నానో.. ఏదైతో అనుకున్నానో.. ...