భారతదేశం, అక్టోబర్ 17 -- Sandeep Reddy Vanga Review On Ranabaali: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. గతంలో 'గీత గోవిందం' తరహాలో ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ తెరపై మ్యాజిక్ చేయడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.

చరిత్రలో పెద్దగా వెలుగుచూడని ఒక చారిత్రక ఘట్టం ఆధారంగా తెరకెక్కిన రణబాలి సినిమాపై సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన రివ్యూ, దానికి సంబంధించి చేసిన పోస్ట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రణబాలి సినిమాలో విజయ్ దేవరకొండ నటనపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసల వర్షం కురిపించారు. విజయ్ తన పాత్రలో చూపించిన ఇంటెన్సిటీ, నటనలోని పరిణతి ఆకట్టుకున్నాయని తెలిపారు.

"గాయ్స్.. విజయ్ దేవరకొండ అద్భుతమైన నటన క...