భారతదేశం, నవంబర్ 6 -- స్మార్ట్‌ఫోన్ ప్రియులకు దక్షిణ కొరియా ఆటోమొబైల్, టెక్నాలజీ దిగ్గజం 'శాంసంగ్'కి సంబంధించి బిగ్ అప్డేట్. తమ తదుపరి ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్ 'శాంసంగ్ గెలాక్సీ ఎస్27' సిరీస్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అధికారికంగా విడుదల కాకముందే ఈ సిరీస్‌కు చెందిన బేసిక్ మోడల్.. భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) సర్టిఫికేషన్ డేటాబేస్‌లో దర్శనమిచ్చింది.

యాపిల్ ఐఫోన్‌కు గట్టి పోటీ ఇచ్చేలా శాంసంగ్ ఈ నయా వర్షన్‌ను సిద్ధం చేస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్‌లో ఫోన్ కనిపించడంతో భారత్‌లో ఈ స్మార్ట్​ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందనే వార్తలకు బలం చేకూరింది.

ఈసారి కంపెనీ గెలాక్సీ ఎస్27 సిరీస్‌లో నాలుగు మోడళ్లను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్​27

శాంసంగ్ గెలాక్సీ ఎస్​27...