భారతదేశం, ఆగస్టు 28 -- స్మార్ట్‌ఫోన్ ప్రియులకు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అదిరిపోయే శుభవార్త అందించింది. గెలాక్సీ S26 సిరీస్‌లో భాగంగా 'గెలాక్సీ S26 ఎఫ్​ఈ' (ఫ్యాన్ ఎడిషన్) మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ఉండే ప్రీమియం ప్రాసెసింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, సుదీర్ఘ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను తక్కువ ధరకే అందించడం ఈ 'ఫ్యాన్ ఎడిషన్' సిరీస్ ప్రత్యేకత.

ప్రీమియం లుక్, అద్భుతమైన కెమెరా ఫీచర్లు కోరుకునే మిడ్-రేంజ్ వినియోగదారులకు ఈ సిరీస్ ఎప్పుడూ మొదటి ఎంపికగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్​26 ఎఫ్​ఈ గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కొత్తగా మార్కెట్లోకి వస్తున్న గెలాక్సీ ఎస్26 ఎఫ్​ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో అలరిస్తోంది. 120హెచ్​జెడ్ రీఫ...