భారతదేశం, మే 19 -- Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ నెట్టింట సంచలనమే సృష్టిస్తుంది. ఇటీవల ఆయన పెట్టిన ఒక పోస్ట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తాను ఒంటరిగా మారిపోయానంటూ ఆయన చేసిన ఆ పోస్ట్ కాసేపట్లోనే వైరల్‌గా మారింది. సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎందుకు ఆయన అలా బాధపడుతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ వ్యవహారంపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందిస్తూ అభిమానులకు అసలు విషయం చెప్పాడు. తన పోస్ట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ ఒంటరిని కానని స్పష్టం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సల్మాన్ ఖాన్ ఈ వైరల్ పోస్ట్‌పై అధికారికంగా వివరణ ఇచ్చాడు. ఫ్యాన్స్ అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుతూ ఒక ఆసక్తికరమైన నోట్ రాసుకొచ్చాడు.

"అరే యార...