భారతదేశం, ఏప్రిల్ 24 -- Sai Sudharsan IPL GT Vs RCB: ఐపీఎల్ 2026 సీజన్‌లో సాయి సుదర్శన్ తన బ్యాట్‌కు పనిచెప్పారు. బెంగళూరు బౌలర్లను ఉతికి ఆరేస్తూ క్లాసిక్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. గత సీజన్‌లోనే తన ముద్ర వేసిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ ఈసారి మరింత పరిణతితో బ్యాటింగ్ చేశారు.

ఎక్కడా అనవసరపు షాట్లకు పోకుండా, కేవలం టైమింగ్‌పైనే ఆధారపడుతూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా బంతిని బలంగా బాదడం కంటే, గ్యాప్‌లను వెతకడంలో సుదర్శన్ చూపించిన నేర్పు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.

ఈ సెంచరీతో సాయి సుదర్శన్ భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు సీజన్లలో సెంచరీలు బాదిన తొలి భారతీయ బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఏ భారత స్టార్ ప్లేయర్‌కూ ఇది సాధ్యం కాలేదు. ఓవరాల్‌గా చూస్తే వ...