భారతదేశం, ఏప్రిల్ 27 -- Sai Pallavi About In Ek Din In Promotional Event: మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయి పల్లవి గత పదేళ్లుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయికగా రాణిస్తోంది. ఫిదా, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది సాయి పల్లవి.

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిపుల్ సాయి పల్లవి. అయితే, ఇప్పుడు 'ఏక్ దిన్' చిత్రంతో బాలీవుడ్‌లోకి సాయి పల్లవి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే.

ఆదివారం (ఏప్రిల్ 26) జరిగిన ఏక్ దిన్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో సాయి పల్లవి పాల్గొని తన మనసులోని మాటలను పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సమక్షంలో సాయి పల...